
పెనుగొలను ఆలయంలో ఘనంగా రాజరాజేశ్వరి దేవి అలంకరణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిధిలోని గంపలగూడెం మండలం పెనుగొలను శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ పార్వతి దేవిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈరోజు సాయంత్రం శమీ పూజ, స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.







































