
గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: వృద్ధుడు దుర్మరణం
గన్నవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆవుల కోటయ్య (75) అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. చెంచుల కాలనీకి చెందిన మృతుడు, చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





































