పేలుడు పదార్థాల కలకలం

4చూసినవారు
పేలుడు పదార్థాల కలకలం
విజయవాడలోని కృష్ణలంక పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ పోలీస్ ఔట్ పోస్టు వద్దకు వచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు తన లగేజ్ బ్యాగ్ బదులు మరో ప్రయాణికుడి బ్యాగ్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగ్‌ను పరిశీలించగా, అందులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పోలీసులు, బ్యాగ్ ఎవరిది, పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి, ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్