
దసరా కానుకగా అన్నదాత సుఖీభవ రెండో విడత విడుదల
ఏపీలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత ఆర్ధిక సాయాన్ని అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది రూ.20 వేలు రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. తొలి విడతలో రూ.7 వేలు అందగా, రెండో విడతలో రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకంతో కలిపి ఈ నిధులు విడుదలవుతాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు ఈ సాయం ఉపయోగపడనుంది.
































