Sep 29, 2026, 17:09 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
సిరిసిల్ల బస్టాండ్లో వీధి కుక్కల గుంపులు: ప్రయాణికుల్లో ఆందోళన
Sep 29, 2026, 17:09 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపైకి వస్తున్న కుక్కల వల్ల వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు బస్టాండ్కు వస్తుండటంతో, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.