అవనిగడ్డ - Avanigadda

పాముకాటుతో వ్యక్తి మృతి

పాముకాటుతో వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా మోపీదేవి మండలం అన్నవరం గ్రామానికి చెందిన బొమ్ము శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున పాముకాటుతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకునే అతను మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కలువ పూలు విక్రయించడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బహిర్భూమికి వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. గమనించకుండా ఆలయం వద్ద పూలు అమ్ముకుంటుండగా అస్వస్థతకు గురై కిందపడి నోటి వెంట నురగ రావడంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.