Oct 06, 2026, 18:10 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్
Oct 06, 2026, 18:10 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో జరిగిన వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికల్లో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ 211 ఓట్ల భారీ మెజార్టీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆయనను మంగళవారం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రెండేళ్లు ఆటో కార్మికుల సంక్షేమం కోసం సేవకుడిగా పనిచేస్తానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు.