
తూములు ఏర్పాటు చేయాలి
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో సిమెంట్ రోడ్లు పగల గొట్టి వారం రోజులు అవుతున్న తూములు వేయలేదు. ప్రయాణికులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా సెలవులు రావడం వలన అవి అలాగే ఉన్నాయి. అధికారులు స్పందించి తూములు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రావు కోరారు.





































