
చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని
గుడివాడలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి, చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో చిరంజీవి ఎందరికో ఆదర్శనీయుడని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరారని నాని వ్యాఖ్యానించారు. చిరంజీవి కొత్త సినిమా "కాకా" కూడా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.





























