Oct 04, 2026, 14:10 IST/
ఉజ్వల యోజన లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. రూ.300 సబ్సిడీ పొడిగింపు
Oct 04, 2026, 14:10 IST
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్యాస్ సిలిండర్ రీఫిల్పై ఇచ్చే రూ.300 సబ్సిడీని 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 4 సిలిండర్లకు ఈ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అదనంగా, మరో 25 లక్షల కొత్త ఉచిత కనెక్షన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు నిండిన మహిళలు రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ వివరాలతో ఆన్లైన్ లేదా డిస్ట్రిబ్యూటర్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు.