
కంభంపాడులో ఘనంగా పోషణ ఉత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలోని అంగన్వాడి సెంటర్ల ఆధ్వర్యంలో పోషణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని గర్భిణీలు బాలింతలు తీసుకోవాలని చెప్పారు. అంగన్వాడి సెంటర్ల ద్వారా ఇచ్చే పోషకాహారాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిల్లకల్లు సిడిపిఓ దభ్భాకుపల్లి సెక్టార్ సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




























