
కైకలూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్య సమాచారం
కైకలూరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. సెప్టెంబర్ 10 ఉదయం 9 గంటలకు నీలవరం మండలంలోని నీలవరం వర్క్స్ హాల్, వెంకట్రావుపేట రోడ్, కైకలూరులో డ్రైవింగ్ లైసెన్స్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాల వారికి ఈ అవకాశం. 18 ఏళ్లు నిండిన వారు తక్కువ రుసుముతో లెర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. MC వాహనాలకు ₹260, MC+LMV వాహనాలకు ₹410 రుసుము.


























