Oct 16, 2026, 11:10 IST/
భర్తను చంపి.. దుప్పట్లో పామును వదిలిన మహిళకు మరణశిక్ష
Oct 16, 2026, 11:10 IST
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో భర్తను హత్య చేసి, పాముకాటుతో చనిపోయినట్లు నమ్మించిన రవిత, ఆమె ప్రియుడికి కోర్టు మరణశిక్ష విధించింది. అమిత్ కశ్యప్ (25) నిద్రిస్తున్న సమయంలో రవిత గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ప్రియుడి సాయంతో పామును తెచ్చి భర్త దుప్పట్లో వదిలి, పాముకాటుతో చనిపోయాడని నమ్మించింది. అయితే పోస్టుమార్టంలో ఊపిరాడక మరణించినట్లు తేలింది. పాము విషపూరితం కాదని గుర్తించిన పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది.