
మచిలీపట్నం రానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం మచిలీపట్నం రానున్నారు. మంగినపూడి బీచ్ వద్ద ఏర్పాటు చేసిన 63 అడుగుల సాగర తీర విజయ గణపతి స్వామిని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ మహా గణపతిని దర్శించుకోనున్నారు.




































