Oct 09, 2026, 17:10 IST/
అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు
Oct 09, 2026, 17:10 IST
తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్కూళ్లకు అక్టోబర్ 22 వరకు, జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 21 వరకు సెలవులు ప్రకటించారు. స్కూళ్లకు 13 రోజులు, ఇంటర్ కాలేజీలకు 12 రోజుల పాటు ఈ సెలవులు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. అక్టోబర్ 23న పాఠశాలలు, అక్టోబర్ 22న జూనియర్ కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.