Oct 04, 2026, 09:10 IST/
BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 చెల్లిస్తే చాలు!
Oct 04, 2026, 09:10 IST
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ను తీసుకొచ్చింది. అక్టోబర్ 12 వరకు కొత్తగా సిమ్ తీసుకునేవారికి లేదా ఇతర నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యేవారికి రూ.1కే సిమ్ అందిస్తోంది. దీనితో 24 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వినియోగిస్తున్న వారికి ఈ ఆఫర్ వర్తించదు. సమీప బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా గుర్తింపు పొందిన రిటైలర్ వద్ద ఈ ఆఫర్ పొందవచ్చు.