
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జిల్లా వాసులు మృతి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డి పాలెం గ్రామం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పీహెచ్సీకి తరలించారు. మృతులు గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకుప్పుల ప్రేమ్ కుమార్, మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





































