మైలవరం మండలం - Mylavaram Mandal

రాజన్న సిరిసిల్ల జిల్లా
Sep 21, 2026, 06:09 IST/

వినాయక నిమజ్జనం.. ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత (VIDEO)

Sep 21, 2026, 06:09 IST
వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత నెలకొంది. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఉత్సవ సమితి సభ్యులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. జీహెచ్‌ఎంసీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏర్పాట్లు చేయకపోతే తామే చేసుకుంటామని సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్‌ తెలిపారు.