
గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామంలోని శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామంలోని ప్రజలందరూ కలిసి అంగరంగ వైభవంగా పాల్గొన్నారు. ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

























