నందివాడ మండలం - Nandivada Mandal

రాజన్న సిరిసిల్ల జిల్లా
Oct 14, 2026, 16:10 IST/

కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్ పోయింది: కేటీఆర్‌

Oct 14, 2026, 16:10 IST
గోదావరిఖనిలో జరిగిన సింగరేణి కార్మిక గర్జన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యుత్ ఆగమైందని, కాంగ్రెస్ రాగానే కరెంట్ పోయిందని విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, కరెంట్ కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 70 మి.టన్నుల నుంచి 58 మి.టన్నులకు తగ్గిందని, సింగరేణిలో సీఎం బావమరిది పెత్తనం, కుంభకోణాల కుంభమేళా నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు.