పామర్రు - Pamarru

ఘనంగా అన్సారుల్లా ఖుద్దాముల్ అత్ఫాలుల్ అహ్మదీయ్యా వార్షిక ఇజ్తిమా

ఘనంగా అన్సారుల్లా ఖుద్దాముల్ అత్ఫాలుల్ అహ్మదీయ్యా వార్షిక ఇజ్తిమా

పెదపారుపూడి మండలం కోర్నేపాడులో కృష్ణా జిల్లా అధ్యక్షులు షేక్ నాగుర్ సాహెబ్ అధ్యక్షతన అన్సారుల్లా ఖుద్దాముల్ అహ్మదీయ్యా అత్ఫాలుల్ అహ్మదీయ్యా వార్షిక ఇజ్తిమా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ నుండి అన్సారుల్లా భారత్ ప్రతినిధి సుల్తాన్ అల్లావుద్దీన్ సాహెబ్ పాల్గొని నమాజ్‌పై దృష్టి సారించాలని, యువత, బాలలను ధార్మిక మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అన్సారులదని తెలిపారు. జిల్లా నాజిమ్ అన్సారుల్లా మహమ్మద్ యాకూబ్ పాషా సాహెబ్ ప్రపంచ శాంతి కోసం దువా చేయాలని పిలుపునిచ్చారు. యువకుల అధ్యక్షులు షేక్ బాపూజీ సాహెబ్ యువత చెడు ప్రభావాలకు దూరంగా ఉండాలని సూచించారు. ధార్మిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.