
హత్య కేసులో ఒకరు అరెస్ట్
కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన లారీ క్లీనర్ సంజయ్ హల్దార్ను అరెస్టు చేశారు. గత నెల 30వ తేదీ రాత్రి మద్యం మత్తులో పశ్చిమబెంగాల్ కు చెందిన డ్రైవర్ ఆనంద్ సర్కార్తో మద్యంమత్తులో గొడవపడి, ఇనుపరాడ్తో దాడి చేసి హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారైన నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు.




























