Sep 08, 2026, 12:09 IST/
నోరా ఫతేహిపై రూ. 3 కోట్ల దావా (వీడియో)
Sep 08, 2026, 12:09 IST
బాలీవుడ్ నటి నోరా ఫతేహికి బిగ షాక్ తగిలింది. ఆమెపై డ్యూన్స్ ఏవియేషన్ సంస్థ రూ.3 కోట్ల దావా వేసింది. ఇటీవల నోరా డ్యూన్స్ ఏవియేషన్కు చెందిన చార్టర్ విమానాన్ని 'బొమ్మ విమానం', 'చిన్నగా ఉంది' అంటూ ఎగతాళి చేస్తూ వీడియో రికార్డ్ చేసి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో, తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతిందని, బుకింగ్లలో 15-20 శాతం తగ్గుదల ఏర్పడిందని డ్యూన్స్ ఏవియేషన్ ఆరోపించింది. దీంతో, సంస్థ రూ. 3 కోట్ల దావా వేసింది. ఆ పోస్టులను తొలగించాలని, నోరా ఫతేహి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.