
యాజమాన్య కమిటీ అధ్యక్షులుగా ఆంజనేయులు ఎన్నిక
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. అధ్యక్షులుగా ఆదూరి ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా షేక్ షక్రూన్ బీని ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాదు, గ్రామ ప్రజలు ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేశారు.






































