Sep 11, 2026, 14:09 IST/
తెలంగాణలో 'అనలాగ్' పన్నీర్పై ఏడాది పాటు నిషేధం
Sep 11, 2026, 14:09 IST
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్పై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించింది. సెప్టెంబర్ 10, 2026 నుంచి ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. పనీర్ పేరుతో ఇతర పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, చట్టబద్ధంగా ప్రమాణీకరించబడిన ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదు.