
సీఎం సభ సమీపంలో పేలిన గ్యాస్ సిలిండర్
విజయవాడలోబుధవారం అజిత్సింగ్నగర్ బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం జరుగుతుండగా సమీపంలోని నిమ్మకాయ సోడా బండి వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది. ఎండ తీవ్రత కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఈ భారీ శబ్దంతో సభకు హాజరైన ప్రజలు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.




































