Sep 27, 2026, 03:09 IST/
టీఎంసీ ఎమ్మెల్యే కారుపై రాళ్లు, గుడ్లతో దాడి
Sep 27, 2026, 03:09 IST
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి శెరంపూర్ వెళ్తుండగా, కొందరు వ్యక్తులు నల్లజెండాలతో చుట్టుముట్టి, కారుపై గుడ్లు, రాళ్లు విసిరారని టీఎంసీ నేత ఒకరు తెలిపారు. ఈ దాడిలో కునాల్ ఘోష్ కారు వెనుక అద్దం పగిలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని ఘోష్ ఆరోపించారు.