
పదో తరగతి విద్యార్థుల లైంగిక దాడి.. గర్భం దాల్చిన మానసిక స్థితి బాలేని మహిళ
గన్నవరం పట్టణంలో మానసిక స్థితి సరిగా లేని 34 ఏళ్ల మహిళపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను మొదట గన్నవరం ఆసుపత్రికి ఆతరవాత విజయవాడ జీజీహెచ్ కు తరలించగా వైద్య పరీక్షల్లో బాధితురాలు రెండు నెలల గర్భిణి అని, గర్భస్రావమై బ్లీడింగ్ అవుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు నెలల కిందట ఇస్లాంపేటకు చెందిన ఇద్దరు మైనర్లు తనపై లైంగిక దాడికి పాల్పడి, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, గత ఐదు నెలలుగా అప్పుడప్పుడూ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తన తల్లికి తెలిపింది. పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి, పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.




































