
ఉచిత వైద్య శిబిరం ఉపయోగకరంగా ఉంది..కార్మికురాలు
ఆదోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆదోని జీఎంహెచ్ఎస్లో పనిచేస్తున్న వరలక్ష్మమ్మ చికిత్స చేయించుకున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య సమస్యలను పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. ఇలాంటి శిబిరాలు తమలాంటి వారికి ఎంతో ఉపయోగకరమని వరలక్ష్మమ్మ సంతోషం వ్యక్తం చేశారు.




























