Sep 13, 2026, 11:09 IST/
నా పదవిని తీసేసే ధైర్యం ఎవరికీ లేదు: కొండా మురళి (వీడియో)
Sep 13, 2026, 11:09 IST
TG: తన పదవిని తీసేసే ధైర్యం ఎవరికీ లేదని, నమ్మిన వారికి న్యాయం చేశానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా మురళి తెలిపారు. సురేఖ గెలుపునకు రాహుల్ గాంధీ కృషి చేశారని, ప్రధానిని చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలే ముఖ్యమని, కృతజ్ఞత తమ రక్తంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. తన కూతురి మాటలకు తనకు సంబంధం లేదని, కార్యకర్తల కోసమే పార్టీలో ఉంటామని, వారే తన బలం అని తెలిపారు.