ఆలూరు - Alur

దళిత కాలనీలో మురుగునీరు: బీఎస్పీ నాయకుల ఆందోళన

దళిత కాలనీలో మురుగునీరు: బీఎస్పీ నాయకుల ఆందోళన

ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో దళిత కాలనీలోకి మురుగునీరు చేరడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, దీనికి పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యమే కారణమని బీఎస్పీ తాలూకా అధ్యక్షుడు కొమ్మ రమేష్ ఆరోపించారు. అధికారులకు దళిత కాలనీలంటే చులకన భావమని ఆయన అన్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా డ్రైనేజీ ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బుధవారం బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పిజిఆర్ఎస్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.