గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి : సిపిఎం

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణం సిద్దేశ్వర కాలనీలో 15 సంవత్సరాల నుంచి నివాసముంటున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె పి నారాయణ స్వామి సిఐటియు మండల కార్యదర్శి జి షాకీర్ అవాజ్ మండల అధ్యక్షులు ఎస్ ఎస్ భాష డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిసి రోడ్లు డ్రైనేజీ, తాగునీటి కుళాయిలు, విద్యుత్ స్తంభాలు ,అంగన్వాడీ కేంద్రం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉగాది రోజు ఇంటి పట్టాలు పంపిణీ లో సిద్దేశ్వర కాలనీ వాసులు కూడా పట్టాలు ఇవ్వాలని అని అన్నారు.అనంతరం సిద్దేశ్వర కాలనీ నూతన శాఖ ఏర్పాటు చేశారు. 21 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా తులసమ్మ సహాయ కార్యదర్శిగా విటల్ రెండో సహాయ కార్యదర్శిగా లక్ష్మీ నరసమ్మ మూడో కార్యదర్శిగా గౌరమ్మను కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈశ్వర్ గౌడ్, అబ్దుల్ గనీ, రాజు, డివైఎఫ్ఐ నాయకులు మైన సురేంద్ర, వీరేష్, దుర్గప్ప , మహానంది పాండు, లక్ష్మి ,గౌసియా, ఆదిలక్ష్మి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.