బనగానపల్లె - Banaganapalle

బాలిక విద్యను ప్రోత్సహిద్దాం - బ్రహ్మానంద చారి

బాలిక విద్యను ప్రోత్సహిద్దాం - బ్రహ్మానంద చారి

బనగానపల్లె మండలం గోవింద్ దీన్నే ప్రాథమిక పాఠశాల యందు జై కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో మనం ఫౌండేషన్ అధ్యక్షులు లాయర్ చక్రవర్తి సహకారంతో విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి బాలిక విద్యను ప్రోత్సహిద్దాం బాల్య వివాహాలు నిర్మూలిద్దాం కార్యక్రమం పై సదస్సు నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ మగ పిల్లవానితో సమానంగా ఆడపిల్లలను చదివించాలని బాలిక విద్యను ప్రోత్సహించాలని ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలోనూ, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని బాల్వివాహాల నిర్మూలనకు సమాజంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.