Sep 23, 2026, 11:09 IST/
ఆర్మీలో 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదల
Sep 23, 2026, 11:09 IST
ఇండియన్ ఆర్మీ 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనుంది. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో BE, BTech లేదా MSc ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జూలై 1 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఎంపికలో SSB ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఉంటాయి.