Sep 19, 2026, 16:09 IST/
సూపర్ ఎల్నినో.. దేశంలో ప్రమాదకర వాతావరణం
Sep 19, 2026, 16:09 IST
రాబోయే రోజుల్లో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026-27లో ఎల్నినో సాధారణం కన్నా శక్తివంతంగా ఉండొచ్చని, ఇది దేశంలోని అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2026 నవంబర్ నుంచి వచ్చే ఏడాది వరకు భారత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా వేడి, పొడి వాతావరణం ఉండొచ్చని, ఇది వ్యవసాయం, అడవులు, పశుపోషణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.