
స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ, వాతావరణ కాలుష్యంపై అవగాహన సదస్సు
డోన్ sv డిగ్రీ కళాశాలలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో మంగళవారం ప్రిన్సిపాల్ కుళ్ళాయ్ రెడ్డి అధ్యక్షతన స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పిసి పీఎన్డీటీ చట్టం, 'మెడియేషన్ ఫర్ ది నేషన్ 3.0' కార్యక్రమం ద్వారా వాతావరణ కాలుష్యం, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని కోరారు.
























