Sep 14, 2026, 15:09 IST/రాజేంద్రనగర్
రాజేంద్రనగర్
శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
Sep 14, 2026, 15:09 IST
రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్, భావన రుషి నగర్లో గల శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ప్రతిమకు ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు ఏర్వ సత్యనారాయణ, కాశీగారి యాదగిరి, ఉష్కమూరి విజయ్ కుమార్, దొంత రాజు, సామల యాదయ్య, బండరీ యాదగిరి, ఏర్వ కుమారస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.