గోనెగండ్ల - Gonegandla

రంగారెడ్డి జిల్లా
Oct 01, 2026, 16:10 IST/

ఆస్పత్రి బయటే కాన్పు.. నలుగురు డాక్టర్లు, నర్సుపై వేటు

Oct 01, 2026, 16:10 IST
యూపీలోని భదోహి జిల్లా ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది.  తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న 20 ఏళ్ల గర్భిణి రాణి వనవాసిని చేర్చుకోవడానికి నిరాకరించడంతో, ఆమె ఆస్పత్రి బయట రోడ్డుపైనే ప్రసవించింది. బాధితురాలి సోదరుడు రక్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విచారణలో తేలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీ నలుగురు డాక్టర్లు, ఒక నర్సు నిర్లక్ష్యాన్ని నిర్ధారించింది. కాంట్రాక్ట్ డాక్టర్ పంకజ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించగా, మరో డాక్టర్ జీతాన్ని నిలిపివేశారు. మిగిలిన వారిపై చర్యలకు సిఫారసు చేశారు.