Sep 23, 2026, 13:09 IST/
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుఫాన్ బీభత్సం (వీడియో)
Sep 23, 2026, 13:09 IST
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో బుధవారం భారీ ఈదురుగాలులు, తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది. ఆకాశంలో నల్లటి మేఘాలు, దట్టమైన దుమ్ము, చీకటి అలముకోవడంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి, ఇళ్ల రేకులు ఎగిరిపడ్డాయి. పలువురు గాలికి కొంత దూరం నెట్టబడి చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.