Oct 12, 2026, 08:10 IST/
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు RBI కీలక నిర్ణయం
Oct 12, 2026, 08:10 IST
దేశీయ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 12 నుంచి IOCL, BPCL, HPCL వంటి చమురు సంస్థలకు అవసరమైన డాలర్లను నేరుగా సమకూర్చాలని RBI నిర్ణయించింది. దీనివల్ల చమురు కంపెనీలు మార్కెట్లో డాలర్ల కోసం పోటీపడాల్సిన అవసరం ఉండదు, తద్వారా ఓపెన్ మార్కెట్ నుంచి డాలర్ డిమాండ్ తగ్గి రూపాయి క్షీణతకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.