Sep 09, 2026, 17:09 IST/
ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి (వీడియో)
Sep 09, 2026, 17:09 IST
కర్ణాటకలోని మాండ్య జిల్లాలోబుధవారం కేఎస్ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రాలీలోని ఐరన్ రాడ్లు బస్సు ముందు అద్దం చీల్చుకుని లోపలికి చొచ్చుకెళ్లాయి. దీంతో డ్రైవర్ శేఖర్ (హాసన్) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 10 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బెల్లూరు ఎయిమ్స్కు తరలించగా, వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.