
బోయ శేఖర్ కు టి.జి.వి కళా క్షేత్రములో సన్మానం
కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయ శేఖర్ కు కర్నూలు టి. జి. వి కళా క్షేత్రములో తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన శతాదిక కవి సమ్మేళనంలో పాల్గొని చక్కని కవితా గానం చేశారు. దీంతో వారిని టి. జి. వి కళా క్షేత్రము చైర్మన్ టి. జి. వెంకటేష్, కర్నూలు జిల్లా విద్యాధికారి టి. జి. వి కళా క్షేత్రము అధ్యక్షులు పత్తి ఓబుల్లయ్య తదితరులు అభినందిస్తూ ఘనంగా సన్మానించి సత్కరించారు.














