Sep 25, 2026, 12:09 IST/
పాకిస్థాన్కు నిద్రలేని రాత్రులు: అమిత్ షా
Sep 25, 2026, 12:09 IST
యూపీలోని అమేథీలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్ నిద్రలేని రాత్రులు గడుపుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అమేథీలో తయారవుతున్న ఏకే-203 రైఫిళ్లు మావోయిస్టులు, ఉగ్రవాదులను బెంబేలెత్తిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు శత్రు స్థావరాలను నాశనం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.