మంత్రాలయం - Mantralayam

మానవత్వం చాటుకున్న నరవ దంపతులు

మానవత్వం చాటుకున్న నరవ దంపతులు

కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రాంతానికి చెందిన విజయ్‌ వాస్కులర్‌ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన భార్య మారెమ్మ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విషయం తెలుసుకున్న నరవ దంపతులు ఎన్. రమాకాంత్‌ రెడ్డి, నరవ శశిరేఖ అండగా నిలిచారు. విజయ్‌కు నిమ్స్‌లో వైద్యం చేయించడంతో పాటు సీఎం సహాయ నిధి ద్వారా రూ.2.54 లక్షలు మంజూరయ్యేలా కృషి చేశారు. అలాగే సుమారు రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పెద్దకడబూరులో నరవ దంపతులను మారెమ్మ కుటుంబ సభ్యులు సత్కరించారు. తమ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచి, తన భర్తకు ప్రాణం పోశారని మారెమ్మ కృతజ్ఞతలు తెలిపారు. వారి మానవత్వాన్ని జీవితాంతం మరిచిపోలేమని పేర్కొన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.