Sep 28, 2026, 17:09 IST/ఎల్బీనగర్
ఎల్బీనగర్
బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య జన్మదిన వేడుకలు ఘనం
Sep 28, 2026, 17:09 IST
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ మన్సూరాబాద్లోని ఓ ఆఫీస్లో బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య జన్మదిన వేడుకలను పలువురు బీసీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం వట్టే జానయ్య చేస్తున్న కృషి అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, వాసు, నీరజ గౌడ్, మేకల కృష్ణ, దాసరి నగేష్, కొమ్ము శ్రీనివాస్ యాదవ్, జక్కుల రాము యాదవ్, కుమార్ ముదిరాజ్, రమేష్ రజక, జక్కుల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.