
వీపనగండ్ల జడ్పీ హై స్కూల్ SMC కమిటీ ఎన్నిక
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం వీపనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికలలో స్వామి మద్దిలేటి చైర్మన్గా, అవిజ లావణ్య వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడానికి సమష్టిగా కృషి చేస్తామని వారు తెలిపారు.


























