
గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.. శక్తి టీం
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, నంద్యాల మండలం రాయమల్పురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులకు 'నో టచ్' విధానంపై బుధవారం అవగాహన కల్పించారు. ఆపద సమయంలో అమ్మాయిలు తమను తాము ఎలా కాపాడుకోవాలో వివరించారు. కొత్త వ్యక్తులు పిలిచినా, తిను వస్తువులు ఇచ్చినా వెళ్లరాదని, తినరాదని సూచించారు. తెలిసినవారు లేదా తెలియనివారు అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు లేదా టీచర్లకు చెప్పాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని శక్తి టీం తెలియజేసింది.































