Oct 15, 2026, 11:10 IST/
విదేశీ బొగ్గు దిగుమతిలో రూ.3 వేల కోట్ల స్కాం: KTR
Oct 15, 2026, 11:10 IST
TG: సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ రాశారు. రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలని డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. 'భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే CM చీకటి ఒప్పందం. కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి కంపెనీని రేవంత్రెడ్డి రంగంలోకి దింపారు. భోత్రా లాజిస్టిక్స్తో ప్రభుత్వం, సింగరేణి ఒప్పందం బయటపెట్టాలి. మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలపై చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు' అని అన్నారు.