Sep 16, 2026, 17:09 IST/
వెజిటేబుల్ ఆయిల్ దిగుమతులపై పన్నులు తగ్గించే యోచనలో కేంద్రం?
Sep 16, 2026, 17:09 IST
పండుగల వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వెజిటేబుల్ ఆయిల్ దిగుమతులపై పన్నులు తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పండుగల సీజన్లో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. 16.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలను 5 శాతం చేయనుందని తెలుస్తోంది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద వెజిటేబుల్ ఆయిల్ దిగుమతిదారుగా భారత్ ఉంది.