Sep 25, 2026, 07:09 IST/
గణేశ్ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్.. రెండేళ్ల బాలుడు మృతి
Sep 25, 2026, 07:09 IST
TG: ఖమ్మం నగరంలో గణేశ్ శోభాయాత్ర సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ చిక్కుకోవడంతో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడు వైభవ్ నాయక్ మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు గురువారం అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో వాహనం ముందుకు కదలకపోవడంతో తండ్రి తన కుమారుడిని భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.